![]() |
![]() |

ప్రతీ సంక్రాంతి పండగకి సిటీలో ఉన్న ఉద్యోగస్తులు, రోజు కూలీ చేసుకునేవారు, కళాకారులు.. ఇలా అన్ని రకాల వారు తమ తమ సొంత ఊర్లకి వెళ్తుంటారు. అయితే కొంతమంది సెలెబ్రిటీలకి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి వీలు కాదు. కాబట్టి వారున్న ఇంట్లోనే పండుగ జరుపుకుంటారు. పిండివంటలు చేసుకుంటూ తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు తను చేసిన అరిసెను చూపిస్తూ హిమజ ఓ వీడియోని షేర్ చేసింది.
హిమజ.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సినిమాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలలో నటించిన హిమజ.. మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. విజయవాడలో పుట్టిన హిమజ.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమారంగంలోకి వచ్చింది. బిగ్ బాస్-3 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన హిమజ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది. హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది.
.webp)
హిమజకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా విదేశాలలో ట్రావెల్ చేసి వచ్చిన హిమజ.. సంక్రాంతికి అరిసెలు చేస్తూ ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అరిసెను అరిపించానంటూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అరిసెను అరిపించాను. ఆలస్యం చేసిన ఆశాభంగం అనే క్యాప్షన్ కూడా పెట్టేసింది ఈ భామ. ఇక ఈ స్పెషల్ అరిసె ఎవరికి కావాలంటూ హిమజ అడుగగా.. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |